
మిషన్ కాకతీయ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి నిధుల కటకట ఏర్పడింది.. పైసలు లేనిదే పథకం ముందడుగు పడడం లేదు.. దీంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేంద్రం సాయం కావాలని లేఖ రాసింది.
సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రూ.5వేల కోట్ల సాయం చేయాలని విన్నవించారు. కాగా ఈ వర్షాకాలంలో చెరువుల పూడికను నిలిపివేశారు. ఇప్పట్లో ఆ పనులు కావు.. ఇక వానలు పడి చెరువులు నిండని వాటినే మాత్రమే మరమ్మతులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో వచ్చే శీతాకాలం వరకు నిధులు మంజూరైనా నిండని చెరువుల మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది.