టోమ్జా సభ్యత్వ నమోదుకు భారీ స్పందన

తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (టోమ్జా) సభ్యత్వ నమోదు కార్యక్రమం హైదరాబాద్ లో ఈరోజు ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆన్ లైన్ వెబ్ మీడియా, చానల్ పోర్టళ్లలో పనిచేసే చాలామంది జర్నలిస్టులు తమ తమ పేర్లను నమోదు చేసుకొని సభ్యత్వం తీసుకున్నారని టోమ్జా అధ్యక్షులు అయిలు రమేశ్ తెలిపారు. ఇదే రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా అయిలు రమేశ్ మాట్లాడుతూ ప్రింట్ మీడియా ను దాటి ఎలక్ట్రానిక్ మీడియా రాగానే ఇదొక స్పీడ్ యుగం అనుకున్నామన్నారు.. కానీ ఇప్పుడు ఆన్ లైన్ మీడియా వచ్చాక.. కేవలం రోజులు కాదు గంటలు కాదు క్షణాల్లో వార్తలు చూసే పరిస్థితి జనాలు చూడగలుగుతున్నారు. ఒక సంఘటన జరిగగానే క్షణాల్లో వెబ్ సైట్లలో పెడుతున్నారు. దాన్ని జనాలు ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో షేర్ చేస్తూ జనాలు చూస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో సైతం ఆన్ లైన్ మీడియా విస్తరించింది. హైదరాబాద్ లో రెండు ఆరా ఉన్నసైట్లు ఇప్పుడు 200 పైచిలుకు వెబ్ సైట్లు , న్యూస్ పోర్టల్స్, వెబ్ చానల్స్ వచ్చి జనాలకు చేరువవుతున్నాయి. అందులో పనిచేసే జర్నలిస్టులందరికీ పత్రిక, చానాళ్ల మాదిరిగానే అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు, ప్రభుత్వ ప్రయోజనాలు దక్కేలా టీయూడబ్ల్యూజే తరఫున పోరాడుతాం.. అందరూ సభ్యత్వం తీసుకొని సంఘంగా ఐకమత్యంగా పోరాడి హక్కులు సాధించుకుంటామని అయిలు రమేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆన్ లైన్ మీడియాలోని సబ్ ఎడిటర్లు, జర్నలిస్టులు టోమ్జాలో పెద్దఎత్తున తమ సభ్యత్వాలు తీసుకున్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కానీ లేదా 9440002999 నంబర్ లో గానీ సంప్రదించాలని అయిలు రమేశ్ కోరారు.

img_20160907_143551 img_20160907_143714img_20160907_143805

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *