అంతపొద్దున లేచి మేయర్ ఏం చేస్తున్నాడంటే..

ప్రతిరోజూ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో నగరంలో విస్తృతంగా తిరుగుతున్నారు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్. మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కొన్ని రోజులుగా ఉదయం ఐదు గంటలకే నగర పాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది చేపడుతున్నా పనులను పరిశీలిస్తున్నారు, అదికూడా సైకిల్ పైన వెళ్ళుతున్నారు, అయన వెంట వచ్చే అధికారులు కార్పొరేటర్లు, మరియు నాయకులు ఎవరూ వచ్చిన వారు కూడా సైకిల్ పైన రావలసిందే అని నిబంధన పెట్టరు.

mayer1
చిన్న పదవీ వస్తేనే మంది మర్బాలంతో కన్వాయిలతో ముందు వెనుక కార్లు పెట్టుకొని హడవుడి చేసే వాళ్ళను మాత్రమే మనం ఇన్ని రోజులు చుశాం కాని ఇలా సైకిల్ పై వెళ్ళి నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని మనం ఎలా పరిష్కారం చేయగలమని ఆలోచన చేసే అసలు సిసలైన ప్రజా సేవకుడిని మనం సర్దార్ రవీందర్ సింగ్ గారి రూపంలో చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతీ సందర్భంలో చెప్పే మాట “ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని” ఆ మాటలను మన మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు అనుసరిస్తూ నిత్యం పేద ప్రజల కోసం పని చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మేయర్ పదవిని ఒక బాద్యతగా స్వీకరించి నగర ప్రజలకు ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా తన పరిధిలో ఉన్నటువంటి అన్ని శక్తులను ఒడ్డి సేవలందిస్తున్నారు. జిల్లాలో ఉన్నా ప్రజా ప్రతినిధులు సహకారంతో కరీంనగర్ నగరాన్ని క్లీన్ & గ్రీన్ మరి ముఖ్యంగా పొల్యూషన్‌ రహిత నగరంగా తిర్చిదిద్దాడానికి కృషి చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *