దెబ్బకు దెబ్బ తీశారా..?

Naxal-attack-PTI-May-27

కొద్ది రోజులుగా తెలంగాణలో నక్సల్స్ కదిలికలు లేక ప్రశాంతంగా ఉండేది.. 6 నెలల క్రితం ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న వంతెన పనులకు ఉపయోగించే ప్రొక్లెయిన్ లను, ఇతర భారీ యంత్రాలను నక్సల్స్ అర్ధరాత్రి వచ్చి తగుల బెట్టారు. ఈ పరిణామంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దారునానికి ఒడిగట్టింది ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన మావోయిస్టు ఆత్రం శోభన్ అని గుర్తించారు. శోభన్ తన 20 ఏటనే మావోయిస్టు ఉద్యమంలో చేరి ప్రస్తుతం చత్తీస్ ఘడ్ లో పనిచేస్తున్నారు. అతడే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో అలజడికి కారణమని తెలిసింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని దండకారణ్యంలో మావోయిస్టుల ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెలిసి తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పుల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో విధ్వంసాలకు పాల్పడిన ఆత్రం శోభన్ మృతిచెందాడు. అతడితోపాటు మరో ఇద్దరు చత్తీస్ గడ్ మావోయిస్టులు సైతం మృతిచెందారు. దీంతో తెలంగాణలో విధ్వంసాలకు పాల్పడిన మావోయిస్టులపై పోలీసులు దెబ్బకు దెబ్బ తీసినట్టైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *