Breaking News

మారుతి ఆల్టో, యాక్టివాలను తలదన్నే బండి లేదా..?

045

గడిచిన కొన్ని సంవత్సరాలుగా  ఆ రెండు బండ్లే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటున్నాయి. ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.  ఇందులో కార్ల కేటగిరిలో మారుతి తన హవాను కొనసాగిస్తోంది.. గడిచిన జూలై నెలలో ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయిన తొలి 10 వాహనాల్లో 7 మారుతి సంస్థవే కావడం విశేషం. ఇక రెండో స్థానంలోనూ మారుతి కంపెనీ నుంచే వచ్చిన స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఇక మూడో స్థానంలో మారుతి కారు అయిన వ్యాగన్ ఆర్, నాలుగో స్థానంలో మారుతి స్విఫ్ట్, 5వ స్థానంలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ 10, 8 వ స్థానంలో ఇటీవల ఎక్కువగా అమ్ముడవుతున్న రెనో క్విడ్ ఉంది.

ఇక ద్విచక్ర వాహనాల్లో వరుసగా సంవత్సరం కాలంగా హోండా యాక్టివా అగ్ర స్థానంలో కొనసాగుతోంది.  వరుసగా 2015తో పోలిస్తే ఈ నెలలో పెరిగిన విక్రయాల్లో 38 శాతం యాక్టివానే ఉండడం దీని హవాకు నిదర్శనంగా కనిపిస్తోంది. యాక్టివాకు ముందు ద్విచక్రవాహన అమ్మకాల్లో హీరో కంపెనీ స్ల్పెండర్ ఉండేది. కానీ దాన్ని అధిగమించి యాక్టివా మొదటిస్థానంలో నిలవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *