నిర్మల్.. మంజీరా కొత్త జిల్లాలు తెరపైకి..

కొత్త జిల్లాల ఏర్పాటులో కొత్త కొత్త జిల్లాలు, కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి..ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ సంగారెడ్డి జిల్లాకు ‘మంజీరా’ జిల్లా అని పేరు పెట్టిన ప్రతిపాదించిన కొత్త జిల్లాకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో మెదక్ జిల్లాలో కొత్తగా సంగారెడ్డికి బదులుగా ‘మంజీరా’ జిల్లా తెరపైకి వచ్చింది.. ఇందులో ఖేడ్, అంధోల్, నర్సాపూర్ నియోజకవర్గాలను కలపనున్నారు. దీనికి మంత్రి హరీష్ రావు సైతం చొరవ చూపడంతో ఇప్పుడు మంజీరా జిల్లాకు మార్గం సుగమం అయ్యింది..

ఇక అతిపెద్ద జిల్లా ఆదిలాబాద్ లో ప్రభుత్వం కేవలం రెండు జిల్లాలనే ఏర్పాటు చేసింది. రాజకీయంగా ఎంతో క్రియాశీలికంగా ఉన్న నిర్మల్ ను జిల్లాను చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్ కు ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి కేసీఆర్ సైతం ఓకే చెప్పి కలెక్టర్ ను ప్రతిపాదనలు చేయాలని కోరారట.. దీంతో కొత్తగా ఆదిలాబాద్ లో నిర్మల్ జిల్లా ఏర్పడబోతోంది..

తెలంగాణలో రాజకీయ సామాజిక కారణాలకనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో నిర్మల్, మంజీరాలు చేరబోతున్నాయి.మున్ముందు మరిన్ని కొత్త జిల్లాలకు అవకాశం ఉండొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *