ఎవ్వరైనా సరే.. నో ఎంట్రీ..

మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. రెండు గ్రామాల ప్రజలు రహదారులపైకి వచ్చి ఆందోళన చేయడం.. వారికి మద్దతుగా టీడీపీ, సీపీఎంలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. గ్రామస్థులపై లాఠీచార్జి చేసి.. నాయకులను అరెస్ట్ చేసి తరలించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు రద్దు కోరుతూ నిన్న మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్షం ఆందోళనలను పోలీసులు కట్టడి చేశారు. పోలీసులను అరెస్ట్ చేసి తరలించారు. జేఏసీ చైర్మన్ కోదండరాంను అఖిలపక్షం బంద్ లో పాల్గొని మద్దతు తెలపడానికి గజ్వేల్ కు వస్తున్న సందర్భంగా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోదండరాం ఇది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాదు అని.. దౌర్జన్య పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.మొత్తానికి మల్లన్న సాగర్ లొల్లికి దిగిన అందరు నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు ఆందోళనలను సద్దుమణిగించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *