Breaking News

మహేశ్ పక్కన ఊహించలేదు..

Rakul-Preet-Singh-is-considered-in-A-R-Muragadoss

మురగదాసు-మహేశ్ బాబు కలిసి తీస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. మురగదాస్ గత చిత్రాలు ఎన్నో సూపర్ హిట్లున్నాయి. ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు, హిందీలో కూడా నిర్మిస్తున్నారు.. ఈనేపథ్యంలోనే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేదానిపై తీవ్ర చర్చ జరిగింది. బాలీవుడ్ బ్యూటీ పరిణీత చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. కానీ పరిణీత డేట్స్ కుదరక ఈ సినిమాలో నటించడాన్ని వదిలేసుకుంది.. దీంతో మరో హీరోయిన్ కోసం దర్శకుడు మురగదాసు వెతకడం ప్రారంభించారు.
ఆ లక్కీ అవకాశం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు దక్కింది.. మురగదాస్ నుంచి కాశ్మీర్ లో షూటింగ్ లో ఉన్న రకుల్ ఫోన్ అందుకోగానే మహేశ్ సినిమాలో నటించడానికి కథ కూడా అడగకుండానే ఒప్పేసుకుందట.. అంతేకాదు.. కాల్ అయిపోగానే ఎగిరి గంతేసిందట రకుల్.. మహేశ్ లాంటి సూపర్ స్టార్, మురగ దాసు లాంటి స్టార్ దర్శకుడితో సినిమా చేయాలనే నా కల నెరవేరిందని.. ఆ దేవుడికి కృతజ్ఞతలు అంటూ రకులు తెగ సంబరపడిపోయిందట.. సో ఇలా అదృష్టం రకుల్ కు దక్కింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *