ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఎక్కువ డ‌బ్బు రాబ‌ట్టుకోండి ఇలా..

సులువైన, న‌ష్ట‌భ‌యం లేని పెట్టుబ‌డి మార్గం కోసం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆధార‌ప‌డ‌తారు. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతున్న ప్ర‌స్తుత క్ర‌మంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఎక్కువ రాబ‌డి సాధించేందుకు ప్ర‌య‌త్నించాలి. ఎఫ్‌డీల నుంచి ఎక్కువ డ‌బ్బు రాబ‌ట్టుకునేందుకు ఈ కింది ఆరు ప‌ద్ద‌తుల‌ను పాటించండి.

?? *త‌ల్లిదండ్రుల పేరు మీద డిపాజిట్ చేయ‌డం*

మీ త‌ల్లిదండ్రులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌యి ఉంటే వారికి ఫిక్స‌డ్ డిపాజిట్ల‌పై 0.25 నుంచి 0.50 వ‌ర‌కూ వ‌డ్డీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. వారికి ప‌న్ను సంక్ర‌మించే ఆదాయం లేకుండే వారి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ తెర‌వ‌డం మంచి నిర్ణ‌యం.

?? *కంపెనీ డిపాజిట్ల కోసం ప్ర‌య‌త్నించ‌డం*

ఏఏఏ రేటింగ్ క‌లిగిన డిపాజిట్లలో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఈ డిపాజిట్లు సాధార‌ణ బ్యాంకు డిపాజిట్ల క‌న్నా అధిక రాబ‌డినిస్తాయి.

?? *ఫారం 15జీ, 15హెచ్‌ల‌ను స‌మ‌ర్పించ‌డం*

టీడీఎస్ మిన‌హాయింపు జ‌రుగుతూ ఉంటే, ప‌న్ను సంక్రమించే ఆదాయం లేక‌పోయిన‌ట్ల‌యితే ఫారం 15జీ, 15 హెచ్‌ల‌ను స‌మ‌ర్పించండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌న్ను మిన‌హాయింపు జ‌ర‌గ‌కుండా మీ రాబ‌డి పెర‌గ‌గ‌ల‌దు.

?? *క్యుములేటివ్ డిపాజిట్ల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం*

క్యుములేటివ్ డిపాజిట్ల‌పై చ‌క్ర‌వ‌డ్డీ వ‌స్తున్నందున వాటి కోసం శోధించి ద‌ర‌ఖాస్తు చేయండి. కంపెనీ ఫిక్స‌డ్ డిపాజిట్లు చ‌క్ర‌వ‌డ్డీని లెక్కించ‌వ‌నే విష‌యం తెలిసిందే. బ్యాంకులు ప్ర‌తి త్రైమాసికానికి చ‌క్ర‌వ‌డ్డీని లెక్కిస్తాయి. చ‌క్ర‌వ‌డ్డీ సూత్రం మూలంగా భ‌విష్య‌త్తులో అధిక రాబ‌డికి అవ‌కాశం ఉంటుంది.

?? *మీ డిపాజిట్ల‌ను త్వ‌ర‌గా విత్‌డ్రా చేయ‌క‌పోవ‌డం*

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కూ కాల‌పరిమితికి ముందే విత్‌డ్రా చేయ‌కూడ‌ద‌ని గుర్తుంచుకోండి. అలా చేస్తే పెనాల్టీ విధిస్తారు. మెచ్యూరిటీకి ముందే విత్‌డ్రా చేసే డిపాజిట్ల‌కు బ్యాంకులు 1 శాతం పెనాల్టీని విధిస్తాయి.

?? *ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను తెర‌వ‌డం*

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లో తెర‌వ‌డం మూలంగా సాధార‌ణ డిపాజిట్ కంటే అద‌నంగా ఏమీ రాదు. అయితే అధిక వ‌డ్డీ రేటును అందించే బ్యాంకు డిపాజిట్‌ను వెతుక్కొని పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఆర్‌బీఎల్ బ్యాంకులో 24 నెల‌ల డిపాజిట్‌కు 8.50 శాతం వ‌డ్డీ ఉండ‌గా, ఎస్‌బీఐలో ఈ రాబ‌డి 7.5 శాతంగా ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *