Breaking News

లక్షకు రూ. 5వేల కమీషన్.. ఖాతాల్లో వేసుకుంటారా..?

money-a2ed

నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.. బంగారం కొనుగోళ్లు, ఇతర భారీ ఉపకరణాల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. పనిలో పనిగా పేదలు, మధ్యతరగతి వాళ్లతో డీల్ కుదుర్చుకుని లక్ష రూపాయల డబ్బు తమ ఖాతాలో వేసుకుంటే రూ. 5వేల కమీషన్ ఇస్తామని.. ఇలా పది లక్షలు వివిధ ఖాతాల్లో వేసుకుంటే 50వేలు ముట్టజెప్పుతామని బతిమిలాడుతున్నారు. డబ్బు ఆశకు పేదలు దాన్ని తీసుకుంటున్నారు.
కాగా 2.5 లక్షల కు మించితే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇది తెలియన పేదలు డబ్బులు జమ చేసుకుంటున్నారు. నల్లకుబేరులు 2.5 లక్షలకు మించకుండా ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో నల్ల వ్యాపారం మూడు నోట్లు, నాలుగు కమీషన్లు చందంగా ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో గుట్టుగా జరుగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *