
ఎవరికీ వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ మోసం చేశాడని టీడీపీ ప్రచారం చేసుకుంటే.. తామిచ్చిన సొమ్మును అన్నీ మింగేశాడని బీజేపీ పెద్దలు సెలవిస్తున్నారు. ఇక అలుపెరుగని బాటసారి జగన్ తన పాదయాత్ర ఏదో తాను చేసుకుంటున్నాడు. జనసేనాని పవన్ మాత్రం 15 రోజుల కో సారి గుర్తుకొచ్చి రాజకీయం చేస్తున్నాడు. ఎవరి పంథా వారిదే..
కానీ 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం తాజాగా హాట్ టాపిక్ అయ్యింది. సర్వేలు చేయడంలో దిట్టగా పేరొందిన లగడపాటి రాజగోపాల్ తన టీంతో కలిసి ఏపీలో తాజాగా సర్వే చేశాడట.. అందులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి..
2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలో వచ్చేది టీడీపీయేనని లగడపాటి రాజగోపాల్ తేల్చారు. కానీ పోయిన సారి వలే 2014లో గెలిచినట్టు అన్నీ సీట్లు రావని.. ఈసారి బాబుకు సీట్లు తగ్గి.. వైసీపీకి పెరుగుతాయని సూచించాడు. కానీ వైసీపీ కి 70కి పైగా సీట్లు వస్తే.. టీడీపీకి 95కి పైగా సీట్లు వస్తాయని లగడపాటి తన సర్వే వివరాలను బయటపెట్టాడు. ఇప్పుడు లగడపాటి చేసిన ఈ సర్వే హాట్ టాపిక్ గా మారింది.