కొత్త జిల్లాల వల్ల ఎవరెవరికీ లాభమో తెలుసా..?

disticts

అందరూ ఆడిపోసుకున్నారు.. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఒరిగేదేమిటని.. మాకొచ్చే లాభం ఏంటని అందరూ కామెంట్లు చేశారు. కానీ దీర్ఘకాలిక వ్యూహంతో కేసీఆర్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ ఎన్నో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వందల మందికి ఉపాధిని కల్పిస్తోంది. అంతేకాదు.. ఉన్న ఉద్యోగులకు కూడా మెరుగైన వేతన, మంచి ఉద్యోగాలు, జీతభత్యాలు కల్పించేలా చేస్తోంది..

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ, ఇతర కార్యాలయాలు కొత్త జిల్లాల్లో ఏర్పాటు కాబోతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతాల్లో షాపులకు గిరాకీ ఏర్పడుతోంది. వందల సంఖ్యలో జిరాక్స్ ఇతర సబ్ రిజిస్టార్ , న్యాయవాద, తదితర ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది.. ప్రత్యక్షంగా కలెక్టరేట్ వల్ల దాన్ని నమ్ముకొని పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లతో ఉన్నత పదవులు దక్కుతున్నాయి. కింద స్థాయిలో ఔట్ సోర్సింగ్, టీఎస్ పీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. తద్వారా వందలసంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *