గంగులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్

మైనింగ్, గనులపై ఇటీవల హైదరాబాద్ లో సమావేశం జరిగింది. ఇందులో కరీంనగర్ లోని మైనింగ్, గ్రానైట్ పరిశ్రమల యజమానులతో కేటీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికలోడుతో వెళ్తున్న వాహనాల వల్ల రోడ్లు పాడవుతున్నాయని ఇందుకోసం చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ ఆదేశించారు. అధికంగా ఇన్నాల్లు గ్రానైట్ తరలించినందుకు ఫెనాల్టీ చెల్లించాలని కూడా మైనింగ్ నిర్వాహకులకు స్పష్టం చేశారు.

కాగా దీనిపై సమావేశానికి హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల అభ్యంతరం తెలిపారట.. సమావేశంలోనే సీఎం కేసీఆర్ తమకు గ్రానైట్, మైనింగ్ తరలించడానికి వీలుగా చెక్ పోస్టులు ఎత్తివేశారని.. మీరు పెట్టడం సరికాదని అనడంతో మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట.. ‘‘సీఎం పేరు చెప్పి అక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని.. అలా తప్పించుకోవడానికి ఇది మునుపటి రోజులు కావని.. కేసీఆర్ పేరు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా’’ అని ఎమ్మెల్యే గంగులను కడిగిపారేశారట మంత్రి కేటీఆర్.. కేటీఆర్ ఆగ్రహానికి కిమ్మనకుండా ఉన్న గంగుల అనంతరం అక్కడ నుంచి జారుకున్నాడట..

ఎమ్మెల్యే గంగులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *