కేటీఆర్ చేస్తున్న మరో మంచి పని

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ప్రజలకు కంఠకంగా మారిన సమస్యలను చాకచక్యంతో పరిష్కరిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇటీవలే గ్రేటర్ లో రోడ్లు, పారిశుధ్యం, హరితహారాన్ని గ్రాండ్ నిర్వహించి సక్సెస్ అయిన కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి పెనుశాపంగా తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను తరలించే పనిలో ఉన్నారు.

కాలుష్య, పరిశ్రమలపై హైదరాబాద్ లో సమీక్షించిన కేసీఆర్ రాజధానిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందులో కాలుష్య కారకాలుగా ఉన్న 1068 పరిశ్రమలకు అధికారులు గుర్తించారు. 2017 డిసెంబర్ వరకు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల తరలించాలని.. అలా తరలించే పరివ్రమలకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తామని కేసీఆర్ వివరించారు. దీంతో కాలుష్య రహిత హైదరాబాద్ కు కేటీఆర్ బీజం వేసినట్టైంది. ఇలా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ కేటీఆర్ హైదరాబాద్ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *