మంత్రి కేటీఆర్ మళ్లీ అదరగొట్టాడు..

హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మంత్రి కేటీఆర్ తన ప్రసంగంతో పారిశ్రామిక వేత్తల మనసులు చూరగొన్నాడు.. ఏకధాటిగా చాలా తెలివిగా మాట్లాడి అక్కడి పారిశ్రామికవేత్తలతో శభాష్ అనిపించుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినా సీఎం కేసీఆర్ సమన్వయంతో వాటన్నింటిని అధిగమించామని తెలిపారు. తెలంగాణ కరెంట్ కష్టాలు తీర్చామన్నారు. అలాగే టీఎస్ఐపాస్ తో సింగిల్ విండో అనుమతులు ఇచ్చి తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండోస్థానంలో ఉందని తెలిపారు. కొత్తగా హైదరాబాద్ లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.దీనివల్ల వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి కేటీఆర్ ప్రసంగం అక్కడి ఆహుతుల్లో హుషారును నింపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *