Breaking News

చెరో జిల్లా.. చూడాలి ఎవరు మిన్నా..?

3

తెలంగాణ మంత్రులు కేటీఆర్ , ఈటెల రాజేందర్ లు తారసపడితే ఆప్యాయంగా పలకరించుకుంటారు. కేటీఆర్.. ఈటెలను అన్నా అని సంబోధిస్తారు. రాజకీయాల్లో ఈటెల సీనియర్ తో పాటు శాసనసభాపక్షనేతగా కొనసాగడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ సమీక్ష సమావేశాలు, రివ్యూలు, జిల్లా వ్యవహారాలను మంత్రి ఈటెలే చూసుకునేవారు. కేటీఆర్ కూడా ఈటలపైనే భారం వేసి హైదరాబాద్, రాష్ట్రంలోని తన శాఖల్ని పర్యవేక్షించేవారు.. కానీ ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో సీన్ అంతా మారింది.
సిరిసిల్ల జిల్లా కాదు అనుకున్నారంతా కానీ.. కేసీఆర్ సిరిసిల్లను జిల్లా చేయడం.. హుజూరాబాద్ వరంగల్ లోనుంచి కరీంనగర్ లో కలవడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కరీంనగర్ జిల్లా మంత్రి ఈటెల పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న కేటీఆర్ సైతం తన నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లా కావడంతో ఫుల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ది, నిధులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తనను గెలిపించిన సిరిసిల్ల ప్రజల రుణాన్ని జిల్లా తెచ్చి సాకారం చేసిన కేటీఆర్ ఇప్పుడు సిరిసిల్ల జిల్లా మంత్రిగా ఏం చేస్తాడోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *