కేటీఆర్ పై ఇంత అభిమానమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ శ్రేణుల ఆయన పుట్టినరోజు నాడు తెగ సందడి చేశారు. ఈ సందర్భంగా కుత్భుల్లాపూర్ లో మొక్క నాటిన కేటీఆర్ కు ఎమ్మెల్సీ శంభీర్ పూర్ రాజు ఆధ్వర్యంలో బర్త్ డే వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేయించి ప్రజలతో కలిసి భోజనం చేశారు కేటీఆర్..

ఈ సందర్భంగా కేటీఆర్ అభిమానులు నాయకులు, కార్యకర్తలు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్, కేటీఆర్ ఇంటి పరిసరాలు జనసమర్ధ ప్రాంతాల్లో విమానం ద్వారా కరపత్రాలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలను గ్రాండ్ గా తెలిపారు. కేేటీఆర్ అభిమానాన్ని ఇంతలా చాటుకోవడం.. హైదరాబాద్ లోని ప్రతి గల్లీ ఫెక్సీలు, కరపత్రాలు, పాంప్లెంట్లు పోస్టర్లు అంటించడం ద్వారా యూత్, ప్రజల ఐకాన్ గా కేటీఆర్ మారిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *