పుష్కరాలకు వెళ్తున్నారా..? అయితే మీ కోసం..

మరో వారంలో కృష్ణా పుష్కరాలు మొదలవుతాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు తప్పకుండా వెళ్ళాలనే తపన భక్తులు అందరిలోనూ ఉండటం సహజం. ఇదే మొదటి సారి అని కొందరు… మరో సారి వస్తామో లేదో అని కొందరు… ఈ ఏడాదే ఎలాగైనా సరే పుష్కర స్నానాలు చేయాలని… పుణ్యమంతా ఇప్పుడే రాబట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని పుష్కరాలకు ప్రయాణం మొదలెడతారు. వీరి ఆలోచనలో తప్పేమీ లేదు కాని… కొన్ని చిన్న చిన్న సూచనలు పాటిస్తే మీకు, మీ తోటి వారికి, పక్క వారికి… ఇలా అందరికి సురక్షితం మరియు శుభప్రదం!! ఆ సూచనలేంటో ఒక్కాసారి చూద్దాం!!

* తొలిరోజు పుష్కర స్నాన పుణ్యాన్ని… ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకు వదిలెయ్యండి. అనవసరంగా ట్రాఫిక్ జామ్ లో ఇర్రుకుపోయి అవస్థలు పడకండి.

* పుష్కరాలకు సినిమా షూటింగులు కోసం వస్తారు. వారి దగ్గరికి జనాలు కూడా గుంపులుగా వస్తారు. ఇలా షూటింగ్ జరిగే చోటకి వెళ్లి తొక్కిసలాటలో నలిగిపోకండి.

* మహాబలేశ్వర్, మహబూబ్ నగర్, నాగార్జున సాగర్, విజయవాడ, గుంటూరు, కర్నూల్…. ఇలా ఎక్కడ పుణ్య స్నానాలు చేసినా… మీకు దక్కాల్సిన పుణ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే.. మీకు దగ్గరలో ఉన్న ప్రదేశంలో పుణ్య స్నానాలు కానిచ్చేస్తే సరిపోతుంది.

* గుర్తుపెట్టుకోండి… ఓడ్డున ఉన్న నీళ్ళు బాలేవని… కొద్దిగా లోపలి వెళ్తే శుభ్రంగా ఉంటాయని.. పోకడాలకు పోతే.. అసలికే ఎసరోస్తుంది. పుణ్య స్నానం ఎక్కడ చేస్తే ఏంటి?

* మీ తోటి భక్తులకు ఎలాంటి చర్మ రోగాలు ఉంటాయో చెప్పలేం. అందుకే పుణ్య స్నానం అనంతరం ఇంటికో, హోటల్ కో చేరుకొని మరో సారి స్నానం చేస్తే చర్మవ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

* పుణ్య స్నానం పేరుతో ఎక్కువ మునకలు వేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనే భ్రమలో ఉండకండి. ఎన్ని మునకలు వేసినా ఫలితం ఒక్కటే అని గ్రహించండి.

* కృష్ణా నది ఎన్నో వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తుంది. ఇలా యుగాంతం అయ్యే వరకు ఉంటుంది. పుష్కరుడు అనే వాడు పన్నెండు రోజులూ ఆ నదిలోనే ఉంటాడు. కనుక చివరి రోజున స్నానం చేసినా ఫలితం లభిస్తుంది.

* మొదటి రోజే మునక వెయ్యాలన్న ఆత్రం పనికి రాదు. అలా చేస్తే అదే మీకు చివరి మునక అయ్యే ప్రమాదం ఉంది.

* మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం… పుణ్యం కన్నా ప్రాణం ముఖ్యం. మీరు మునిగితే ఆ పుణ్యం మీ ఒక్కరికే వస్తుంది. కాని మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి ఉన్న అండ పోతుంది.

* మనం జూపార్క్ కు వెళ్ళినప్పుడు అక్కడవున్న ప్రాణులను దూరంనుండే చూస్తాం తప్ప వాటి దగ్గరకు వెళ్లి పలకరించే సాహసం చేయం. అలాగే పుష్కరాలలో వీఐపీ లు ఉన్న చోటికి వెళ్లి స్నానాలు చెయ్యాలని ఆశించకండి.

* మీరూ ఉండే ఊరికో, పట్నంకో లేక నగరంకో దగ్గరలో కృష్ణా నది ఉంటె, అక్కడే పుణ్య స్నానాలు కానిచ్చేయండి. దూరప్రాంతాలకు ప్రయాణించి లేని పోనీ తిప్పలు పడకండి. ముఖ్యంగా కొత్త ప్రమాదాలు కొని తెచ్చుకోకండి.

ఈ సూచనలు మీరొక్కరే పాటిస్తే ఎలా చెప్పండి? మీ బంధుమిత్రులు… వారి బంధుమిత్రులు… ఇలా ఎంతో మంది పుష్కరాలకు వెళ్తుంటారు. మారి వారికీ కూడా ఈ సూచనలు చేరాలంటే.. ఈ సమాచారాన్ని మీరు షేర్ చెయ్యాలి!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *