గోదారికృష్ణలు మన అదృష్టం

తెలంగాణలో ఉత్తర దక్షిణ సరిహద్దుల గుండా ప్రవహిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కృష్ణ గోదావరి నదులు మనకు బంగారు గనులని తేలింది. భారత్-అమెరికా  సంయుక్త అన్వేషణలో కృష్ణ-గోదావరి నదుల బేసిన్ లో అపార సహజ వాయు నిల్వలు (గ్యాస్) ఉన్నట్లు తేలింది. భారత దేశ ఇంధన అవసరాలను తీర్చగల స్థాయిలో భారీగా ఇక్కడ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. బంగాళ ఖాతంలోని సముద్రంలో గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఈ గ్యాస్ సముద్రం అడుగు భాగాన మంచు రూపంలో ఉన్నట్టు తేలింది.

హిందూ మహా సముద్రంలో కనిపెట్టిన అతిపెద్ద గ్యాస్ నిల్వలు ఇవేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో మన కృష్ణ, గోదావరి నదులు అపార గ్యాస్ నిక్షేపాలకు నిలయంగా మారాయి. తెలంగాణ, ఏపీలకు నీటినందిస్తూ అపార ఖనిజాలను తమలో ఇమిడ్చుకున్న ఈ గోదావరి కృష్ణలు నిజంగా మన అదృష్టమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *