ఎన్టీవీ టు సాక్షి.. కొమ్మినేని ఫైరింగ్

ఎన్టీవీ ఎడిటర్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చివరకు ఏపీ సీఎం దెబ్బకు సాక్షిలో వచ్చిపడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీవీకి రాజీనామా చేసి సాక్షిలో చేరాడు. ఆయనను తీసివేస్తే తప్ప ఎన్టీవీని నడవనీయమని ప్రతిన బూనిన చంద్రబాబు ఆదేశాలకనుగునంగా కొమ్మినేని ఎన్టీవీని వీడక తప్పలేదు..

కాగా కొత్త గా చేరిన సాక్షి టీవీలో ఆయన కంప్లీట్ వైసీపీకి మద్దతుగా, చంద్రబాబు పాలనను ఎత్తిచూపుతూ చెలరేగిపోతున్నారు. ఇన్నాళ్లు ఎన్టీవీలో కొంత అటూ ఇటూ మాట్లాడిన ఆయన చంద్రబాబుచర్యతో ఇక ఆయనపై యుద్ధానికే దిగారు. జగన్ చానల్ ద్వారా టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా కుంభకోణాలు, లూప్ హోల్స్ ను లాగిపెడుతూ టీడీపీకి మళ్లీ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *