Breaking News

నమ్మించి ఐదుగురు అత్యాచారం.. కొల్లాపూర్ లో ఘోరం

00456+

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికళ్ల గ్రామానికి చెందిన వివాహిత వర్షిణి (24) పై ఐదుగురు అదే గ్రామానికి చెందిన యువకులు అత్యాచారం చేశారు. అన్నయ్యకు రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్లిన వర్షిణి రాత్రివేళ కొల్లాపూర్ కు చేరింది. కుడికళ్ల గ్రామానికి 7 దాటితే ఆటోలు, బస్సులు ఉండవు. దీంతో బస్టాండ్ లో ఉన్న వర్షిణిని అదే గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడు మరో నలుగురితో కలిసి కుడికళ్ల వెళుతున్నాడు. వర్షిణిని తీసుకెళతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్న స్వామి మార్గమద్యంలో అత్యాచారం చేశాడు. మిగతా ఐదుగురు అదే పనిచేశారు. అనంతరం బస్టాండ్ లో దింపేశాడు. అవమానం వర్షిణి ఇంటికెళ్లాక ఆత్మహత్య చేసుకుంది. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన చేశారు. దీంతో పోలీసులు 5 యువకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *