
ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులు, బాలోత్సవ్ కు హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ నేతల తమాషా కథలను ఆసక్తికరంగా వివరించారు. దేశంలోనే నంబర్ 1 ర్యాంకుతో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ను ఏమీ చేయలేని కాంగ్రెస్ నేతలు దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పల్లెనిద్ర పేరుతో గ్రామాల బాట పట్టిన కాంగ్రెస్ నేతలను చూసి జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు..
కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి భారీగా గడ్డం పెంచి పంచెకట్టి రైతుల వద్దకు వెళితే వారు పంచె కడితే రైతు, గడ్డం పెంచితే బాబాలు కాలేరని కేటీఆర్ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో 3 కోట్ల సొమ్ము కారులో కాలిపోయిన విషయం అవినీతిపరుడైన ఉత్తమ్ కు తెలియదా అని ప్రశ్నించారు. కొత్తగా గడ్డాలు ,మీసాలు పెంచినా.. రైతుల్లా పంచెలు కట్టినా మోకాళ్లతో పాదయాత్రలు చేపట్టినా కాంగ్రెస్ ఆశలు నెరవేరయంటూ కేటీఆర్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల వైఖరిని తూర్పార పట్టారు.