
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. పార్టీ ఎంపీలతో ఢిల్లీ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపత్యంలో అన్ని పార్టీలు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పలువురు కేంద్రమంత్రులతో భేటి అవుతున్నారు. రాష్ట్ర సమస్యలను వారితో చర్చించి పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు.. కేసీఆర్ సూచన మేరకు హైకోర్టు విభజన, ఇతర సమస్యలను టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించినట్లు తెలిపారు.