
సీఎం కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు సరికొత్త బాధ్యతలు అప్పజెప్పారు. ఎంపీలు క్రియాశీలక పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఆయా కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు పరిష్కారమయ్యేలా కేసీఆర్ ఢిల్లీ లో నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఎంపీలతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
స్వయంగా కేసీఆర్ ఇన్నాళ్లు ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు, ఒత్తిడి తెస్తున్నారు. ఇకనుంచి అలా కాకుండా ప్రతీ ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలకు ఒకటి లేదా రెండేసీ శాఖలను అప్పజెప్పి ఆయా పనులు పూర్తి చేసేలా కేసీఆర్ నిర్ణయించారు. వారు కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సీఎంగా తాను వచ్చి విన్నవిస్తానని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.