
తెలంగాణ ఏర్పడి రెండేళ్ల తర్వాత కేసీఆర్ షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులను కలవరానికి గురిచేశాయి.. ఇటీవల మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై గ్రామస్థులు, రైతులు రోడ్డెక్కడం.. వారికి పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించడంతో ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.. ఇది సద్దుమణగక ముందే.. ఎంసెట్ 2 లీకేజీ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ ఏర్పడ్డ రెండేళ్లకే ఎంసెట్ లీక్ కావడంతో ప్రభుత్వ పనితీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ రకంగా ఢిల్లీలో పరువు పోయినట్టైంది. ఇక ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ 8 విశ్వవిద్యాలయాలకు నియమించిన వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.. మళ్లీ దీనిపై విచారణ సాగే వరకు స్టే విధించింది. ఇలా మూడు పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడంతో ఏం చేయాలో పాలుపాక అధికారులు, మంత్రులు తలపట్టుకుంటున్నారు..