
తెలంగాణలో జిల్లాల విభజన కొత్త జిల్లాల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించింది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులకు దిశానిర్ధేశం చేశారు.
దేశవ్యాప్తంగా 125కోట్ల జనాభా ఉంటే కేవలం 683 జిల్లాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా సగటు 18.3 లక్షలు మంది మాత్రమే ఉన్నారన్నారు. కాగా తెలంగాణలో 36 లక్షల జనాభా జిల్లాకు ఉన్నారన్నారు. దాదాపు రెట్టింపు జనాభా ఉందని.. దీనివల్ల తెలంగాణ అభివృద్ధికి, వనరుల వినియోగం కాక వెనుకబడిపోతామన్నారు. అందుకే జిల్లాల విభజన చేస్తున్నామన్నారు. అందరూ సహకరించాలని.. కొత్త జిల్లాల ఏర్పాటుపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.