చంద్రబాబును ఇరికించి, నయింను ఖతం చేసిన కేసీఆర్ నమ్మినబంటు

అధికారులు బండరాయి లాంటి వారు. వారిని కంకర రాళ్లుగా మార్చి రోడ్డు మీద వేసి తొక్కేయ్యాలా? లేక శిల్పాలుగా చెక్కి పూజలు అందుకునేట్లు చెయ్యాలా అనేది ఆ యా ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంటుంది. గౌతమ్ సవాంగ్ లాంటి నిజాయితీపరులు చంద్రబాబు చేతిలో పడి కాల్ మనీ సెక్స్ రాకెట్ లో పరువు పోగొట్టుకోగా, శివధర రెడ్డి లాంటి అధికారులు కేసీయార్ చేతిలో పడి శిల్పాలుగా రూపుదిద్దుకుని జన జేజేలు అందుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖ శివధర రెడ్డి గారిని చూసి గర్వం తో ఉప్పొంగి పోతున్నది.

సీఎంగా గద్దెనెక్కగానే కేసీఆర్ చేసిన మొదటి పని ఏంటో తెలుసా.. విశాఖలో ఏసీపీగా కొనసాగుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డిని రప్పించుకోవడం.. గవర్నర్ నరసింహన్ తో మాట్లాడి మరీ శివధర్ రెడ్డిని ట్రాన్స్ ఫర్ చేయించి తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించారు. అంటే తెలంగాణలో అల్లకల్లోలాలు, ఉగ్రదాడులు, ప్రభుత్వాలు కూలిపోయే పథకాలు, సీఎం భద్రత వీటన్నింటి గుట్టు మట్లను తెలుసుకునే కీలక ఇంటెలిజెన్స్ వ్యవహారాలను కోరి మరీ కేసీఆర్ శివధర్ రెడ్డికి అప్పగించారు. ఎంతో నమ్మకస్తుడు, సిన్సియర్ అయిన శివధర్ రెడ్డి కేసీఆర్ అంచనాలకు మించి ఆయన చేత శభాష్ అనిపించుకున్నాడు..

బి. శివధర్ రెడ్డి 1994 బాచ్ అధికారి…రంగారెడ్డి జిల్లావాసి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్.బీ చదివారు. 1993లో నిర్వహించిన సివిల్స్ లో టాప్ మార్కులు సాధించిన మేటి ఆఫీసర్.. జన్మతహా కోటీశ్వరుడు. అవినీతికి ఆమడ దూరం.. ప్రభుత్వం ఏ ఆపరేషన్ అప్పజెప్పినా, మూడో కంటికి తెలియకుండా చక్కబెట్టగల సమర్ధుడు..ఇవాళ ఈయన పేరు తెలంగాణా ప్రభుత్వం లోనే కాదు, ఆంద్ర ప్రభుత్వం లో కూడా మోగిపోతున్నది.

చంద్రబాబును సాగనంపారు..
చంద్రబాబు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోవడానికి కారణమైన “ఓటుకు నోటు ” కేసులో పకడ్బందీ గా స్కెచ్ వేసి రేవంత్ ను, చంద్రబాబు ను ఇరికించింది ఇతనే. పోలీసులు చుట్టుముట్టిందాకా రేవంత్ రెడ్డి తెలుసుకోలేక పోయాడు అంటే ఇతని శక్తి ఏమిటో తెలుస్తుంది.

ఉగ్రవాదులకు సింహస్వప్నం..
మొన్న హైదరాబాద్ లో దొరికిన ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్లాన్ వేసింది కూడా ఈయనే. నిన్న జరిగిన నయీమ్ ఎన్-కౌంటర్ కూడా ఇతను వేసిన పథకం ప్రకారం జరిగిందే. స్పాట్ కు రమ్మని కబురు చేస్తే … తనకు స్పాట్ పడబోతున్నదని …. బుల్లెట్లతో దేహం జల్లెడ అయినదాకా ఆ రాక్షసుడికి తెలియదు. అదీ శివధర్ రెడ్డి గారి వ్యూహ కౌశలం.

ఈ ఆపరేషన్ ను కేసీయార్ ఆయనకు ఎప్పుడో అప్పగించారు. కానీ శివధర్ రెడ్డి ఈ స్కెచ్ వేస్తున్నారని ఆయన అసిస్టెంట్ కు కూడా తెలియదు మరి… తన చీఫ్ సజ్జనార్ తో కలిసి వ్యూహం పన్నారు. ఈ సజ్జనార్ అంటే ఒక విషయం గుర్తు చెయ్యాలి. వైస్సార్ హయాం లో అనుకుంటా.. వరంగల్ లో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసిన ముగ్గురు కామాంధులు ఈయన చేసిన ఎన్ కౌంటరు లోనే ప్రాణాలు పోగుట్టుకున్నారు. అప్పుడు మహిళలు అందరూ ఈయనను ముక్తకంఠం తో అభినందించారు. ఆ తరువాత యాసిడ్ దాడులు చాలా వరకు తగ్గిపోయాయి.

నిప్పులాంటి అధికారుల పనితనం ఆ విధంగా ఉంటుంది. అధికారులను సమర్ధవంతం గా వాడుకుంటే నేరాలకు అడ్డుకట్ట వెయ్యడం కష్టం కాదు. కానీ..నేరస్తుడు మన పార్టీ వాడు అయితే చూసీ చూడనట్లు పోవడం, ఇతర పార్టీ వాడు అయితే పగబట్టినట్లు వ్యవహరించడం లాంటి వక్ర బుద్ధి కలవారు పాలకులుగా ఉంటే, ఎంత గొప్ప అధికారులు అయినా చెయ్యగలిగింది ఏమీ లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *