ప్రధాని, రాష్ట్రపతిలని దాటేసిన కేసీఆర్ జీతం

జీతాల్లో మనడే మొనగాడని తేలింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తో పాటు మంత్రుల జీతాలను పెద్ద ఎత్తున పెంచిన సంగతి తెలిసిందే.. అంతకుముందు వరకు 75000 మాత్రమే ఉన్న జీతాలను కేసీఆర్ సీఎం 2 లక్షలు, మంత్రులకు 60 వేల నుంచి 150000 కు పెంచిన సంగతి తెలిసిందే..

ఈ లెక్కన భారీ పెరుగుదలతో కేసీఆర్ దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. అంతెందుకు మన ప్రధాని , రాష్ట్రపతిలను మించి తీసుకుంటూ కేసీఆర్ రికార్డు సృష్టించాడు..రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నెల వేతనం 150000 కాగా, ప్రధాని కి 1,35,000 మాత్రమే.. అదే మన కేసీఆర్ కు 200000.. అక్షరాల 2 లక్షలు తీసుకుంటూ కేసీఆర్ ముందున్నారు. ఎంతైనా సంపన్న రాష్ట్రమాయే.. ఆ మాత్రం తీసుకోకపోతే మన పరువేం కానూ అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *