
తెలంగాణ లో జడ్జీల నియామకాలపై జడ్జీలందరూ నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే.. దీనిపై సీఎం కేసీఆర్ ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఈ వార్తలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి చేరగా ఆయన స్పందించారు. హైకోర్టు విభజనలో కేంద్రం పాత్ర లేదని తెలిపారు. అది సీఎం కేసీఆర్, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ సీజేల చేతిలో ఉందని తెలిపారు. తెలంగాణలో జడ్జీల వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు.
దీంతో ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టిన కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది.. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతోనే తేల్చుకోవాలని చెప్పడంతో ఈ వివాదం మళ్లీ ముసురుకుంది. కాగా తెలంగాణ న్యాయాధికారుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిరసనలు ఉధృతం చేశారు. మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేసింది హైకోర్టు. దీనికి నిరసనగా మూకుమ్మడిగా సెలవులను కొనసాగించాలని జడ్జీలు నిర్ణయించారు. నాంపల్లిలో ఓ కోర్టులో న్యాయవాది ఆత్మహత్యయత్నం చేశారు. నేడు విధుల బహిష్కరణకు న్యాయవాదులు పిలుపునిచ్చారు.