Breaking News

కేసీఆర్ ఇలాకాలో దోపిడీ.. ఈటెల పరిశీలనలో వెల్లడైన నిజం

MA02CITY-RICE_647646f

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో రేషన్ షాపుల బాగోతం వెలుగుచూసింది. సిండికేట్ గా మారిన కొందరు అక్రమార్కుల అధికారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో రేషన్ షాపులను చేజిక్కించుకొని దోచుకుంటున్న వైనం వెలుగుచూసింది. ఒక్కో బినామీ చేతిలో దాదాపు 25 నుంచి 30 వరకు రేషన్ షాపులున్నట్టు తేలింది. అధికారుల కనుసన్నల్లోనే ఈ రేషన్ షాపుల నిర్వహిస్తూ అందినకాడికి దోచుకున్నట్టు తేలింది.
ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం సహా మిగతా సరుకులను దోచుకుంటున్న అక్రమార్కులు అధికారులతో కలిసి కోట్లకు పడగలెత్తారు. ఈ బినామీలకే ఈ పాస్ మిషన్లు ఇచ్చిన అధికారులు వారి నుంచి 30 నుంచి 50 వేలు వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి.. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిపిన పరిశీలనలో ఈ విషయం వెలుగుచూడడంతో వీటిపై చర్యలకు మంత్రి ఈటెల కేసీఆర్ కు నివేదిక సమర్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *