మోడీ ర్యాంకింగ్స్: కేసీఆర్ 1, చంద్రబాబు 13

దేశంలోనే సీఎం కేసీఆర్ పాలనలో , పనితీరులో అభివృద్ధిలో మొత్తంగా నంబర్ 1 సీఎంగా నిలిచారు. ప్రధాని మోడీ దేశంలోని సీఎంల పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, కొన్ని ప్రైవేటు ఏజెన్సీలతో కలిసి సర్వే నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ పనితీరును కనబరిచి వివిధ సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే కేసీఆర్ నంబర్ 1 సీఎంగా అవతరించారని తెలిసింది..
కేసీఆర్ 1, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2, చత్తీస్ ఘడ్ సీఎం రమణ్ సింగ్ 3, గుజరాత్ సీఎం ఆనందిబెన్ 4, అరవింద్ కేజ్రీవాల్ 5 నంబర్ లో నిలిచారు. కాగా పక్కనే పొరుగు రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు 13 వ స్థానంలో నిలవడం గమనార్హం.
ఇక మోడీ నిర్వహించిన సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికంటె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందంజలో నిలవడం గొప్ప విషయం. ఈ నెల 16న మోడీ అధికారికంగా ఈ ర్యాంకుల్ని ప్రకటిస్తారని సమాచారం. మొత్తానికి మన కేసీఆర్ అత్యంత గొప్ప సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్ని అలాగే దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్నారనడంలో సందేహం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *