కేసీఆర్ మదిలో ఏముంది..? నయీంతో ఆపేస్తారా.. కొనసాగిస్తారా..?

వందల హత్యలు, భూదందాలు, సెటిల్ మెంట్లు చేసిన నయీం కేసీఆర్ ధాటికి నిలవలేకపోయారు. నయీం అధికార పార్టీ నేతలను టచ్ చేయడమే అతడి మరణానికి కారణంగా చెప్పవచ్చు.. ముఖ్యంగా భువనగిరి నుంచి పుట్టి ఎదిగిన నయీం దందా ఎక్కువగా నల్లొండ , హైదరాబాద్ శివారు భూదందాలపైనే నడిచింది. ఈ సందర్బంగా తనకు అడ్డువచ్చిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని టార్గెట్ చేశాడు.. ఎమ్మెల్యేగా దిగిపో తన అనుచరుడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపిస్తానని హుకూం జారీ చేశాడు.. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ను కూడా భూదందా వ్యవహారాల్లో బెదిరించారు. పై నలుగురు ఎమ్మెల్యేలు కూడా నక్సల్స్ ఉద్యమాల్లోంచి విప్లవోద్యమాలనుంచి వచ్చిన వారు. అందుకే వారు నయీం బెదిరింపులకు భయపడక.. కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పైళ్ల శేఖర్ రెడ్డికి బుల్లెట్ ఫ్రూఫ్ కారును కూడా ప్రభుత్వం కల్పించింది. వీరితో మంత్రులు ఈటెలకు కూడా భూదందాల విషయంలో నయీం వార్నింగ్ లు వెళ్లాయి.. దీంతో వీరందరూ కేసీఆర్ ను శరణు కోరారు. దీంతో కేసీఆర్ చట్టానికి పనిచెప్పాడు..
ఇక నయీం ఎన్ కౌంటర్ తో తెలంగాణ ఊపిరి పీల్చుకుంది. ఎన్నో వందల మందిని చంపి,. ఎన్నో వేల ఎకరాల్ని కొల్లగొట్టిన నరహంతకుడిని మట్టుబెట్టిన కేసీఆర్ కు జనంలో జేజేలు అందుతున్నాయి. కేసీఆర్ ఈ చర్యను అందరూ ప్రశంసిస్తున్నారు.. కానీ ఈ ఒక్క నయీంతో నే ఈ కథ ముగిసిపోలేదు. ఇంకా చాలామంది చోటా నయీంలో తెలంగాణలో భూదందాలు, హత్యలు చేస్తూ పెచ్చరిల్లుతూనే ఉన్నారు. వారందరిని కూడా కేసీఆర్ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.. కరీంనగర్ లో ఏఏస్సై మోహన్ రెడ్డి పోలీస్ వేషంలో వేసిన ఆగడాలు.. నయీంను పోలి ఉన్నాయి. అతడి ధాటికి ఇద్దరు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఏఏస్సై మోహన్ రెడ్డినే కాదు చాలామంది హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్నారు. వారందరికీ గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ ఒక వార్నింగ్ మాత్రమే.. ప్రభుత్వం అందరిని ఇలాగే కట్టడి చేస్తే తెలంగాణలో రౌడీలు, గుండాలకు కాలం చెల్లుతుంది. శాంతిభద్రతల్లో తెలంగాణ ముందంజలో ఉంటుంది. కేసీఆర్ ఆ దిశగా పాలన కొనసాగించాలని ఆశిద్దాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *