
తెలంగాణ సీఎం కేసీఆర్ రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన ఇప్తార్ విందులో వారిపై వరాల జల్లు కురిపించారు. ముస్లింలకు రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో మైనార్టీలకు అధిక నిధులు కేటాయిస్తాన్నామని తెలిపారు. ముస్లింలకోసం ఇప్పటికే వందల గురుకులాలు ఏర్పాటు చేశామని.. తద్వారా ముస్లింల విద్యాభివృద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు.
నిజాం కళాశాల మైదానంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసిహంన్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సహా ముస్లిం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.