కేసీఆర్ కుటుంబం సైతం నిర్వాసితులేనట..

ktrkc-647x450

మంత్రి కేటీఆర్ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టాడు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన సతీమణీ, కేటీఆర్ లు కూడా నిర్వాసిత కుటుంబాలే అని తేల్చిచెప్పారు.. కేటీఆర్ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకరానికి హాజరై మాట్లాడారు..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘కేసీఆర్ కుటుంబం కూడా భూములు కోల్పోయిన నిర్వాసితులే.. నిర్వాసితుల బాధలు ఎలా ఉంటాయో మా కుటుంబానికి తెలుసు.. మా కంటే కష్టాలు అనుభవించిన నిర్వాసితులు ఉండకపోవచ్చు.. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం పోసానిపల్లె లో మాతండ్రి కేసీఆర్ ఎగువ మానేరు ప్రాజెక్టు కింద భూములు కోల్పోతే వచ్చిన పరిహారంతో సిద్దిపేట మండలం చింతమడకలో భూములు కొని స్థిరపడ్డాం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారని.. స్వయంగా కేసీఆర్ సైతం నిర్వాసిత కుటుంబమే అన్న వాస్తవాన్ని గ్రహించి  అభివృద్దికి పాటుపడాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *