Breaking News

ఉద్యమ నేతకే ఉద్యమ సెగ

00journlist

తెలంగాణ కోసం కొట్లాడిన సీఎం కేసీఆర్ ఎంత పెద్ద ఉద్యమకారుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అలాంటి గొప్ప ఉద్యమకారుడి పాలనలో మరోసారి మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ జర్నలిస్టులు రెండున్నరేళ్లుగా తమ హక్కుల సాధనకు కొట్లాడుతున్నారు… అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం రెండున్నరేళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో అది కూడా సాధ్యం కాకుండా పోయిందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే దీనికి నిరసనగా ఈనెల 22న తెలంగాణలోని పది జిల్లాల్లో ఆందోళనకు టీయూడబ్ల్యూజే శ్రీకారం చుట్టింది.. హలో జర్నలిస్ట్.. చలో కలెక్టరేట్ పేరుతో నిర్వహించే ఈ ధర్నాలు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జరుగుతాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారుడికే తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ సెగను తగిలించబోతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలను తీరుస్తాడని ఆశిద్దాం..

జర్నలిస్టులు తమ హక్కుల కోసం వెలువరించిన కరపత్రాలు..

001tuwj brocher2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *