Breaking News

దసరాకు కొత్త జిల్లాలు ఏర్పాటు :కేసీఆర్

kcr_Independence_Day

దసరా పండుగకు కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి వేడుకలకు కూడా గోల్కొండలోనే జరుపుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. చత్తీస్ ఘడ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ వచ్చే 4 నెలల్లోనే అందుతుందని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *