కేసీఆర్ విందుకు వేలాయో..

Chandrasekhar-Rao

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు భారీ విందు ఇస్తోంది. హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 7 గంటలనుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ముస్లింలకు విందు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర ముస్లిం ప్రజాప్రతినిదులు పాల్గొననున్నారు.

దీంతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు 200 మసీదుల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేయనున్నారు సీఎం కేసీఆర్. మొత్తానికి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందు ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుండడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *