Breaking News

కేసీఆర్ కు షాక్ లగా..

high-court-kcr

వరుసగా షాక్ లు… సీఎం కేసీఆర్ గద్దెనెక్కాక వరుసగా హైకోర్టులో చుక్కెదురవుతోంది. ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రా న్యాయవాదుల లాబీయింగే ఎక్కువ.. అందుకే తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడి న్యాయవాదులు ప్రత్యేక హైకోర్టు కోసం కొట్లాడుతున్నారు. కానీ ఈ సమైక్య న్యాయ లాబీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే ఉంటోంది..
తాజాగా కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుంచి ప్రాజెక్టుల కోసం తెచ్చిన జీవో 123ని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టంను అమలు చేయాలని .. ఇలా చట్టాలను తుంగలో తొక్కి రైతుల ప్రయోజనాలకు తాకట్టు పెట్టే జీవో 123 చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 123లో దాదాపు 6 రెట్లు పరిహారం రైతులకు దక్కుతుంది. అదే 2013 చట్టంలో పునరావాసం, రెండు రెట్ల పరిహారం, ఉద్యోగాలు కల్పించడం తదితర తక్కువ పరిహారం లభిస్తుంది. దీంతో 123 జీవోనే మెరుగ్గా ఉన్నా కూడా కేంద్రం తెచ్చిన 2013 చట్టమే అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *