
సీఎం కేసీఆర్ ఏదీ చేసినా ఓ రికార్డ్ అవుతోంది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఫాలో అవుతున్నారు.. కాదు కాదు.. వారిని అంత బాగా సమన్వయ పరిచి, ఉత్తేజ పరిచి ఈ పని మనది అన్న భావనను కలిగించడం కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అసలు కేసీఆర్ స్ట్రాటజీనే గొప్పది.. ఏ పనిలోనైనా ఉన్నతాధికారులు కీలక మంత్రులను తనతో కలిపి భాగస్వాములను చేస్తారు.. దీనికో ఉదాహరణ ఉంది..
‘ఏ సీఎం కేసీఆర్ కూడా ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులను కలిసి సమస్యలను విన్నవించేటప్పుడు ఒక్కడే వెళ్లి నివేదికలు సమర్పించి మాకు ఇది కావాలని కోరతారు.. అదే కేసీఆర్ ఆ క్రెడిట్ తనకు వద్దంటూ ఉన్నతాధికారులైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల ఉన్నతాధికారులను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్లి వారి ద్వారా ప్రధాని , రాష్ట్రపతి కేంద్ర కార్యదర్శులను కలిసి పనులు చక్కబెడతారు.. అదే ఏపీ సీఎం నివేదికలను ఒక్కడే సమర్పించి అయ్యిందనిపిస్తారు. అధికారులతో కలిసి పనిచేయడం వల్ల.. వారి పరిచయాలు తెలంగాణకు ఉపయోగపడుతున్నాయి. త్వరితగతిన పనులు అవుతున్నాయి. మోడీని కనీసం కేంద్ర కార్యదర్శులే కలవరు.. అలాంటిది కేసీఆర్ వల్ల మన అధికారులు కలుస్తున్నారు. దీని వల్ల వారి ఇగో సంతృప్తి చెంది మరింత ఎక్కువ పనిచేస్తున్నారు. ఇలా పనులు చేయడంలో చేయించడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు, సీఎం లేరన్నది కాదనలేని వాస్తవం..
ఇప్పుడు తెలంగాణలో మొదలు పెట్టిన మిషన్ కాకతీయ, భగీరథ, కళ్యాణలక్ష్మిలు ఇటీవలే ప్రారంభించిన హరితహారం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దేశవ్యాప్తంగా ప్రచారం లభించడం కూడా కేసీఆర్ స్టామినాకు ఓ మచ్చుతునకే.. హరితహారంలో కోట్ల మొక్కలు నాటించి కేసీఆర్ ఓ రికార్డే సాధించారు. ఇలా ప్రతి పనిని అధికారులతో చక్కబెట్టిస్తూ చాలా బాగా చేయిస్తున్నారు కేసీఆర్.. మంత్రులు కూడా హరితహారంలో పెద్దఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఒకేరోజు దాదాపు 25 లక్షల మొక్కలు నాటించి రికార్డు సృష్టించారు. ఇక మంత్రి ఈటెల కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. హరీష్ రావు మెదక్ లో, ఎర్రబెల్లి , కడియంలు వరంగల్ లో .. ఇలా మంత్రులందరూ హరితహారంలో తమతమ జిల్లాల్లో మొక్కలు నాటించడంలో సక్సెస్ అయ్యారు.ఇవన్నీ పరిణామాలు కేసీఆర్ నాయకత్వంలో హరిత తెలంగాణకు బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.. అన్నీ అనుకున్నట్టు సాగుతున్న కేసీఆర్ ప్రయాణం మరో పదేళ్లు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు..