
సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పునాది రాయి వేసింది ఒక్క కాళేశ్వర ప్రాజెక్టుకే.. ఆ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించి తెలంగాణ భగీరథుడిగా అవతరించాడు. అంతవరకు బాగానే ఉన్నా ప్రారంభం అయిన తర్వాత మీడియాలో ఫోకస్ కావడంతో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి, జలసంఘాలకు ఫిర్యాదు చేసి అడ్డంకులు సృష్టించింది. అందుకే ఇక మీడియా ఫోకస్ పడకుండా సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నాడు..
అందుకే తనకు బదులు అల్లుడు హరీష్ రావును చిన్నా పెద్ద ప్రాజెక్టుల శంకుస్థాపనలకు పంపి ఓపెనింగ్ లు చేయిస్తున్నారు. ఇటీవల పాలమూరు-రంగారెడ్డి నుంచి మెదక్ లో ఓ ప్రాజెక్టు, ఆదిలాబాద్ లో బాసర, ప్రాణహిత, తుమ్మడిహెట్టి, స్వర్ణ సహా గోదావరిపై బ్యారేజీల నిర్మాణాలకు కూడా హరీష్ రావే పోయి గుట్టు చప్పుడు కాకుండా శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభింపచేస్తున్నారు. మంత్రిగా హరీష్ పర్యటనకు మీడియా అంతగా పట్టించుకోవడం లేదు. కానీ సీఎం కేసీఆర్ వేయాల్సిన శంకుస్థాపనలన్నీ హరీష్ చేస్తూ తెలంగాణలో ప్రాజెక్టుల ను పూర్తి చేయడానికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు..
ఈ వ్యూహంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే తలంపు ఉంది. కేసీఆర్ పోతే ఫోకస్ అయ్యి అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా మంత్రి హరీష్ తో శంకుస్థాపనలు చేయిస్తూ పనులు చకచకా పూర్తి చేయిస్తున్నారు. 2019లోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే తలంపుతో ఉంది తెలంగాణ సర్కారు..