అపర భగీరథుడి జలయజ్ఞం

– తెలంగాణ , మహారాష్ట్ర మధ్య కీలక ఒప్పందం….
– గోదావరి,ప్రాణహిత మరియు పెన్ గంగ ప్రాజెక్ట్ లకు లైన్ క్లియర్..
తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో పాటు పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సర్కారుతో సంప్రదింపులు జరిపి… ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో, గోదావరి నదిపై ప్రాజెక్టులకు మహా సర్కారు ఓకే చెప్పింది. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ప్రాజెక్టులకు సంబంధించి తుది ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారుల సమక్షంలో అగ్రిమెంట్ కుదరింది..
అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇచ్చంపల్లి, పెన్ గంగ, ప్రాణహిత, లెండి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్ లో పడిపోయాయి. 1975 లోనే వాటిపై అంతర్రాష్ట్ర ఒప్పందాలు జరిగాయి. అయితే గత ప్రభుత్వాలు.. పొరుగు రాష్ట్రాలతో సరైన వైఖరి చూపకపోవడంతో.. పనులు ముందుకు సాగలేదు. దీంతో, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రాజెక్టులు ముందుకు సాగాలంటే మహారాష్ట్ర సహకారం అవసరమని భావించి.. ఆ దిశగా ముందుకెళ్లారు. మిగతా అంత్రర్రాష్ట్ర ప్రాజెక్టులైన తుమ్మిడి హట్టి, పెన్ గంగ , లెండి వివాదాల పరిష్కారానికి, ప్రాజెక్టు పనులని పురోగతిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో.. సీఎం కేసీఆర్ సమావేశమై ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఇరురాష్ట్రాల అధికారులు, మంత్రులు విస్తృత చర్చలు జరిపారు. సంయుక్తంగా లైడార్ సర్వేలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా అంతర్ రాష్ట్ర వివాదాలు పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. మహారాష్ట్రతో జరగబోయే ఒప్పందమే అందుకు నిదర్శనం. అగ్రిమెంట్ పూర్తైన అనంతరం గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా పూర్తవనున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *