ఢిల్లీ గల్లీలో మోడీతో ఫైట్ కు రెడీ

153-TRS-President-KCR-arrest

సీఎం కేసీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఏకంగా ఢిల్లీ గల్లీలో మోడీ ప్రభుత్వ దమననీతిపై పోరు కు సిద్ధమయ్యారు. హైకోర్టు విభజించకుండా తెలంగాణకు జడ్జీల నియామకంలో జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే తెలంగాణలోని జడ్జీలు, న్యాయవాదులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై హైకోర్టు ఇద్దరు జడ్జీలను సస్పెండ్ చేసింది. మరొకరి డిప్యూటేషన్ రద్దు చేసింది. దీంతో ఈ ఆందోళన పెద్దగా అయ్యింది. ఈ నేపథ్యంలో కలత చెందిన కేసీఆర్ మరోసారి దీనిపై ధర్నా చేయాలని నిర్ణయించారు.

నిన్న ఎంపీలు, సీనియర్ మంత్రులతో సమావేశమైన కేసీఆర్ జడ్జీల ఆందోళన హైకోర్టు సస్పెన్షన్ పై తీవ్ర మనస్తాపం చెందారట.. వారికి న్యాయం కోసం ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని సమావేశం నిర్వహించారు. దీంతో ఇక ఢిల్లీలో మరోసారి తెలంగాణ సీఎం హోదాలో ధర్నా చేస్తుండడంతో దేశవ్యాప్తంగా సంచలన రేగనుంది. సీఎం ధర్నా చేస్తుండడంతో ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *