
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేజీ 2 పీజీ విద్యాలయాల ఏర్పాటులో భాగంగా కొత్తగా బీసీల కోసం 66 గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 50 పాఠశాలలు, 16 కళాశాలలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా 2150 కొత్త కొలువులను ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు పంపించింది. సీఎం ఆమోదం తర్వాత బీసీ గురుకులాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
కాగా దళిత, గిరిజనులకు గురుకులాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎక్కువగా ఉన్న బీసీల విషయంలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీసీలకు సైతం 66 కోత్త గురుకులాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం విశేషం.