
తెలంగాణ న్యాయాధికారుల నియామకాల్లో తెలంగాణ జడ్జీలకు అన్యాయం జరుగుతోందని.. దీనిపై హైకోర్టు ముందు ధర్నా చేస్తాం.. మాతో కలిసి రావడానికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెడీ యేనా అని మండిపడ్డారు ఎంపి కవిత.. ఉమ్మడి హైకోర్టును విభజించకుండా తెలంగాణ ఐఏఎస్ లపై కేసులు పెడుతున్నారని.. ఇక్కడ ిప్రభుత్వ పథకాలను కొనసాగకుండా హైకోర్టు ద్వారా చంద్రబాబు అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటిపై తెలంగాణ సీఎం కేసీఆర్ మనస్తాపంతో ఉన్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జడ్జీలకు అండగా ఉంటామని.. అవసరమై కేసీఆరే ఢిల్లీలో ధర్నా చేస్తారని కవిత న్యాయవాదులకు హామీ ఇచ్చారు.
కాగా మల్లన్నసాగర్ లో ఏకమైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తెలంగాణ జడ్జీలకు న్యాయం కోసం టీఆర్ఎస్ తో కలిసి రావాలని కవిత కోరారు. బీజేపీ నేతలు దమ్ముంటే మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు.