Breaking News

ఉద్యమ నాయకుడి పాలనలో అంతా ఉద్యమాలే..

ఉద్యమ నాయకుడని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. తన పాలనలో కలెక్టరేట్ల వద్ద, గ్రామాలు, పట్టణాల్లో అందరూ తమ సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఆరోపించారు. కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, వంటావార్పు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  మోసం చేయాలనే ఆలోచన కేసీఆర్ లోనే ఉందని.. అందుకే జర్నలిస్టుల నుంచి ప్రజల వరకు అందరిని మోసం చేస్తూ హామీ లు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని కటకం ఆరోపించారు. మల్లన్న సాగర్ తో ప్రజలను ముంచాడని.. ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్ల వేశాడని ఆరోపించారు. అల్లుడికి, బిడ్డకు, కొడుకుకు నౌకరీలు ఇచ్చి నిరుద్యోగులకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి తమ కలంతో సేవ చేసి తెలంగాణ వచ్చేందుకు సహకరించిన కేసీఆర్ పుట్టలో పాము వలే తప్పించుకున్నాడని విమర్శించారు. వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాగా ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, పీవీ సూర్యం, పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం జర్నలిస్టుల ఆందోళనలో మాట్లాడిన వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *