Breaking News

మా నీళ్లను దోచుకెళ్తావా కేసీఆర్..

katakam

జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి నీటిని మెదక్ జిల్లాకు తరలిస్తూ కేసీఆర్ దోచుకుంటున్నారని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఆరోపించారు. కరీంనగర్ లోని మెట్ట ప్రాంతాలైన హుస్నాబాద్ , హుజూరాబాద్, రామగుండం, పెద్దపల్లి, మానకొండూర్ లకు ముందు నీటిని తరలించాలని.. ఇక్కడి సాగు అవసరాలు తీరాకే మెదక్ కు తరలించాలని మండిపడ్డారు. మిషన్ భగీరత పేరుతో ప్రధాని నరేంద్ర మోడీతో ఈ అక్రమ నీటి దోపిడీని ప్రారంభించేందుకు చేస్తున్న కేసీఆర్ ది నిరంకుశ పాలన అని విమర్శించారు.

ఇప్పటికే జిల్లా నుంచి గోదావరి జలాలను పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నా జిల్లాలోని 5 నియోజకవర్గ ప్రజలు ఒక్క చుక్క కూడా ఉపయోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నీటిని మెదక్ తరలిస్తుంటే జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ముందుగా జిల్లా అవసరాలకు నీటి వాడుకున్నాకే బయటకు తరలించాలని కటకం డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఈ 5 నియోజకవర్గ ప్రజలతో కరీంనగరంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం (5న) ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *