
అంతటా కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ప్రజలు ఉదయాన్నే సమీపంలోని వాగులు, వంకలు, దేవాలయాల్లోని కోనేరుల్లో స్నానాలకు బయలు దేరి వెళ్లారు. ఉసిరి కాయతో స్నానాలు చేసి పూజలు కార్తీక మాస విశిష్టతలు నైవేద్యాలు తయారు చేసి పూజలు చేశారు.
తెలంగాణ , ఏపీ వ్యాప్తంగా ఆలయాలు కిటకిట లాడాయి. తిరుపతి, అన్నవరం, బాసర, వేముల వాడ, కాళేశ్వరం క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి తీర కాళేశ్వరంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపించింది. విజయవాడ కృష్ణమ్మ వద్ద భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతులతో మురిసిపోతున్నాయి.