గుళ్లు, గోపురాలు లేని కరీంనగర్ ఎవరిక్కావాలి.?

కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా.. కేసీఆర్ సైతం కరీంనగర్ అంటే అభిమానం. అందుకే ఆయన కరీంనగర్ ఎంపీగా మూడుసార్లు గెలిచారు. ఏ కార్యక్రమమైనా కరీంనగర్ జిల్లాకు, ఇక్కడి ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభిమానిస్తారు. అలాంటి జిల్లా ఇప్పుడు నాలుగు ముక్కలవుతోంది. ఈ కారణంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన జిల్లా ఇప్పుడు ఎందుకు కొరకాకుండా అయిపోతోంది..

3

ఎంతో చరిత్రగల కరీంనగర్ తన అస్తిత్వాన్ని కోల్పోబోతోంది. ముఖ్యంగా జిల్లాలో ప్రముఖ దేవస్థానాలున్నాయి.. వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల, కొండగట్టు, ధర్మసాగర్ సరస్వతీ , భీమదేవరపల్లి కొత్తకొండ ఇలా ప్రముఖ ఆలయాల పుట్ట అయిన కరీంనగర్ జిల్లాలో విభజనతో అన్ని జిల్లాలు ఇతర జిల్లాల్లో కలిసి కరీంనగర్ బోసిపోబోతోంది.. వేములవాడ సిరిసిల్ల జిల్లాలో, కొండగట్టు జగిత్యాలలో, ధర్మపురి జగిత్యాలలో, కాళేశ్వరం భూపాలపల్లిలో కలిసిపోతున్నాయి. ఈ పరిణామాలు ఆధ్యాత్మిక ఖిల్లాగా పేరొందిన కరీంనగర్ కు చేటు తెస్తున్నాయి. దీంతో కొందరు ప్రజాభిప్రాయ సేకరణలో కరీంనగర్ జిల్లా విడిపోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరీంనగర్ అస్తిత్వం కోల్పోబోతోందని ఆరోపిస్తున్నారు..

1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *