
ఎట్టకేలకు కరీంనగర్ స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకుంది. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపికలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి గతంలో విజ్ఞప్తి చేశారు.
దీనిపై గతంలో చాలా తతంగం నడిచింది. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించానా అంత పెద్ద జనాభాకు పథకం పనిచేయదని రాష్ట్ర సీఎం కేసీఆర్ వెంకయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ కు బదులుగా కరీంనగర్ ను చేర్చాలని కోరారు. తెలంగాణలో వరంగల్ తర్వాత కరీంనగర్ ముఖ్య నగరమని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేంద్రం కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేశామని కేంద్రం తెలిపింది.