గంగుల అనుకున్నది సాధించాడు..

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుకున్నది సాధించాడు. ఇన్నాళ్లు కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు కరీంనగర్ మండలం మాత్రమే ఆయన పరిధిలో ఉండేది. దీంతో నాయకుల సర్ధుబాటు వారికి పదవుల పంపకం ఎమ్మెల్యే గంగుల కు తలకు మించిన భారంగా ఉండేది. అందుకే ఆదినుంచి కరీంనగర్ కార్పొరేషన్ ను, మండలాన్ని వేరు చేయాలని ఆయన కేసీఆర్ ను కోరుతూనే ఉన్నారు. కానీ అది ఇప్పుడు నెరవేరింది..

ఎట్టకేలకు జిల్లాల పునర్విభజనలో కరీంనగర్ మండలం మూడు ముక్కలైంది. కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ గా రూపాంతరం చెందింది. దీంతో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర నామినేటెడ్ పదవుల సంఖ్య పెరగనుంది. ఈ పరిణామంతో ప్రస్తుతం గంగుల కమలకార్ హ్యాపీగా ఉన్నాడట.. అంతేకాదు..  అధికార యంత్రాంగం కూడా పెరగడంతో ఇకపై పనులు కూడా సులభంగా అవుతాయని గంగుల ఆనందంగా ఉన్నాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *